సిక్స్త్ సెన్స్ సీజన్ 5 కి ఈ వారం "దయా" వెబ్ సిరీస్ టీం వచ్చి ఫుల్ సందడి చేసింది. జెడి చక్రవర్తి, ఈషా రెబ్బా, కమల్ కామరాజ్, జోష్ రవి వచ్చారు. ఈ షోలో ఫస్ట్ రౌండ్ అయ్యాక జెడి. చక్రవర్తి, ఈషా రెబ్బ గెలిచారు. వీళ్ళు సెకండ్ రౌండ్ కి వెళ్ళాక ఇద్దరు చీర్ గర్ల్స్ వచ్చి ప్రాపర్టీస్ ని స్టేజి మీద పెట్టారు. అప్పుడు వాళ్ళను చూస్తూ అలాగే ఉండిపోయాడు చక్రవర్తి. "నా క్లాప్స్ సన్నగిల్లాయి.." అని జెడి అనడంతో "ఎందుకని" అని అడిగాడు ఓంకార్. "వాళ్ళవి ఒరిజినల్ కాళ్లేనా అవి..అంత తెల్లగా ఉన్నాయేమిటి. ఒకసారి ముట్టుకోవచ్చా" అని అడిగేసరికి ఆ లేడీస్ వచ్చి నిల్చున్నారు. వాళ్ళ దగ్గరకు జెడి.చక్రవర్తి వెళ్లి "ఇవి మీ ఒరిజినల్ కాళ్లేనా, నాకు చాలా డౌట్ గా ఉంది. నా గురువు రామ్ గోపాల్ వర్మకి కాళ్ళ గురించి బాగా తెలుసు. నాకు కూడా ఆ కాళ్లతో ఏదైనా చెయ్యాలని ఉంది. ఈషా మనం ఈ కళ్ళను చెక్ చేయాలి.. లేదంటే ఓంకార్ మనల్ని మోసం చేస్తున్నాడేమో" అని వాళ్ళ కాళ్ళను టచ్ చేసి " గర్ల్స్ మీరు ఒరిజినల్.. మీరు అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్లకపోతే నా మైండ్ పనిచేయదు" అని జెడి చక్రవర్తి అనడంతో వాళ్ళను పంపించేశారు ఓంకార్.
"దయా" త్వరలో రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఈ వెబ్ సిరీస్ టీం ప్రమోషన్స్ లో భాగంగా ఈ షోకి వచ్చారు. "దయా గురించి చెప్పాలి అంటే నా డైరెక్టర్ పవన్ సాదినేని గురించి చెప్పుకోవాలి. ఫస్ట్ టైం నేను ఒక అబ్బాయితో లవ్ లో పడ్డాను.. అదే పవన్ సాదినేని... నార్మల్ గా మూవీ చేసాక బాగుంది అని చెప్పడం సాధారణమే..కానీ ప్రతీ రోజు ప్రతీ షాట్ కూడా చాల ఎక్సయిట్ గా డిజైన్ చేసి మమ్మల్ని బాగా మెస్మోరైజ్ చేసాడు. నీ సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకోవడానికి ఈ షోలో ఉన్నాం.." అని చెప్పాడు జెడి చక్రవర్తి. "ఈ ప్రాజెక్ట్ నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు.. ఇందులో చేసింది చాలా డిఫరెంట్..నా నటన కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది" అని చెప్పింది ఈషా రెబ్బా.